బుమ్రా: బుమ్రా, పాండ్యాలతో న్యూజిలాండ్ ఓపెనర్ గప్తిల్ సెల్ఫీ!

  • మూడో వన్డే కోసం ముంబై ఇండియన్ ఆటగాళ్లతో కలిసి ప్రయాణిస్తున్నా
  • పాండ్యా హెయిర్ స్టైల్ గురించే ఆలోచిస్తున్నా
  • ‘ఇన్ స్టా గ్రామ్’ లో గప్తిల్

భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మూడో వన్డే కాన్పూర్ వేదికగా ఈ నెల 29న జరగనుంది. ఈ నేపథ్యంలో రెండు జట్ల ఆటగాళ్లు పుణె నుంచి కాన్పూర్ కు విమానంలో బయలుదేరి వెళ్లారు. టీమిండియా ఆటగాళ్లు బుమ్రా, హార్డిక్ పాండ్యాలతో న్యూజిలాండ్ ఓపెనర్ గప్తిల్ ఓ సెల్ఫీ దిగాడు. ఈ ఫొటోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతా ద్వారా గప్తిల్ తన అభిమానులతో పంచుకున్నాడు.

'ముంబై ఇండియన్ ఆటగాళ్లు బుమ్రా, పాండ్యాలతో కలిసి తదుపరి మ్యాచ్ కోసం విమానంలో ప్రయాణిస్తున్నా, పాండ్యా హెయిర్ స్టైల్ గురించి ఆలోచిస్తున్నా' అని తన పోస్ట్ లో గప్తిల్ పేర్కొన్నాడు.

కాగా, ఈ పోస్ట్ పై నెటిజన్లు స్పందిస్తూ..‘అద్భుతమైన ఫొటో’, ‘హార్దిక్  హెయిర్ స్టైల్ చాలా బాగుంది. ముంబై ఇండియన్ ప్లేయర్స్ ని ఒకే చోట చూడటం సంతోషంగా ఉంది’ అని ప్రశంసించారు. ఇదిలా ఉండగా, టీమిండియా కెప్టెన్ కోహ్లీ కూడా శిఖర్ ధావన్, పాండ్యతో కలిసి దిగిన ఓ ఫొటోను పోస్ట్ చేశాడు. కాన్పూర్ లో వాతావరణం చాలా బాగుందని తన ట్వీట్ లో పేర్కొన్నాడు. హార్దిక్ పాండ్యా కూడా అదే ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు.

  • Loading...

More Telugu News