కంచ ఐలయ్య: నా ఆరోగ్యం బాగుండలేదనే వదంతులు నమ్మొద్దు: కంచ ఐలయ్య
- పాత్రికేయులతో మాట్లాడిన ఐలయ్య
- విజయవాడ సమావేశానికి నన్ను వెళ్లకుండా చేసేందుకు కుట్ర
- ఆ సమావేశానికి వెళ్లి తీరతానంటున్న ప్రొఫెసర్
తన ఆరోగ్యం బాగుండలేదంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని ప్రొఫెసర్ కంచ ఐలయ్య చెప్పారు. ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, తన ఆరోగ్యం బాగానే ఉందని, ఈ విషయమై వస్తున్న వదంతులను పట్టించుకోవద్దని అన్నారు. విజయవాడలో రేపు నిర్వహించనున్న సమావేశం విషయమై తన ఇంట్లో చర్చలు జరుగుతున్నాయని చెప్పిన ఐలయ్య, విజయవాడ వెళ్లకుండా చేసేందుకు పెద్ద కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఏదిఏమైనప్పటికీ, విజయవాడ సమావేశానికి వెళ్లి తీరతానని ఐలయ్య ఈ సందర్భంగా మరోమారు స్పష్టం చేశారు.