Telugudesam : కౌన్సిల్ హాలులో బ‌ల్ల‌లు, కుర్చీలు లాగి ప‌డేసిన టీడీపీ స‌భ్యులు.. మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ఎన్నిక రేప‌టికి వాయిదా

  • కృష్ణా జిల్లాలోని జ‌గ్గ‌య్యపేట మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ఎన్నికలో ర‌సాభాస
  • త‌మ కౌన్సిల‌ర్ల‌ను వైసీపీ నేత‌లు అప‌హ‌రించారంటోన్న‌ టీడీపీ స‌భ్యులు
  • ఎన్నిక జ‌ర‌ప‌కూడ‌దంటూ టీడీపీ స‌భ్యుల నినాదాలు
  • మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ఎన్నిక రేప‌టికి వాయిదా

కృష్ణా జిల్లాలోని జ‌గ్గ‌య్యపేట మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ఎన్నికలో ర‌సాభాస కొనసాగుతోంది. ప‌దే ప‌దే వాయిదా ప‌డుతోంది. త‌మ కౌన్సిల‌ర్ల‌ను వైసీపీ నేత‌లు అప‌హ‌రించారంటూ టీడీపీ స‌భ్యులు నిర‌స‌న తెలుపుతున్నారు. కిడ్నాపైన ఇద్ద‌రు స‌భ్యుల్ని తీసుకొచ్చేవ‌ర‌కు ఎన్నిక జ‌ర‌ప‌కూడ‌దంటూ టీడీపీ స‌భ్యులు నినాదాలు చేస్తున్నారు. ఎన్నికల అధికారి పోడియాన్ని చుట్టుముట్టిన‌ టీడీపీ కౌన్సిల‌ర్లు ఎన్నిక వాయిదా వేయాల్సిందేన‌ని ప‌ట్టుప‌డుతున్నారు. స‌భ్యుల ఆందోళ‌న‌తో మున్సిప‌ల్ ఛైర్మ‌న్ ఎన్నిక రేప‌టికి వాయిదా ప‌డింది. రేపు ఉద‌యం 11 గంట‌ల‌కు ఎన్నిక ఉంటుంద‌ని ఎన్నిక‌ల అధికారి హ‌రీశ్ చెప్పారు.  

  • Loading...

More Telugu News