కరీం తెల్గీ: నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం నేరస్థుడు కరీం తెల్గీ కన్నుమూత

  • కర్ణాటక జైలులో శిక్ష అనుభవిస్తున్న తెల్గీ 
  • అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి
  • నాడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెల్గీ కేసు

నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణం నేరస్థుడు అబ్దుల్ కరీం లాలా తెల్గీ (66) ఈరోజు మృతి చెందాడు. కర్ణాటకలోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న కరీం కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో బెంగళూరులోని విక్టోరియా ఆసుపత్రికి సోమవారం తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కరీం తెల్గి ఈ రోజు మృతి చెందాడు. కాగా, కరీం తెల్గీకి 20 ఏళ్ల వయసు నుంచే షుగర్ వ్యాధి, బీపీ ఉన్నాయి. 2001లో హెచ్ ఐవీ వైరస్ సోకిందని అప్పట్లో వైద్యులు ధ్రువీకరించారు.

ఇదిలా ఉండగా, 33 వేల కోట్ల రూపాయల నకిలీ స్టాంపు పేపర్ల కుంభకోణంలో 2001 నవంబరులో అజ్మీర్ లో తెల్గీని అరెస్టు చేశారు. ఈ కేసులో ముద్దాయిగా తేలడంతో 43 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ నాడు బెంగళూరు కోర్టు తీర్పు నిచ్చింది. కొందరు పోలీసు అధికారులు, రాజకీయ నాయకులు, పాత్రికేయుల సహకారంతోనే తెల్గీ ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డాడనేది ప్రధాన అభియోగం.

తెల్గీ నుంచి రూ.72 లక్షలను అప్పటి ముంబై పోలీసు జాయింట్ కమిషనర్ శ్రీధర్ వగాల్ తీసుకున్నారని నాటి విచారణలో తేలింది. తెల్గీ మొదట్లో దొంగనోట్లు ముద్రించడమే కాకుండా, నకిలీ పాస్ పోర్టులను తయారు చేసి డబ్బు సంపాదించేవాడని ఆరోపణలు వున్నాయి. పెద్దమొత్తంలో డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో నకిలీ స్టాంపు పేపర్ల దందాలోకి దిగిన కరీం తెల్గీ, ఆ తర్వాత కొన్నేళ్లకు పట్టుబడ్డాడు. 2006 జనవరి 17న తెల్గీ, అతని ప్రధాన అనుచరులకు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు నిచ్చింది.

  • Loading...

More Telugu News