జగన్: ప్రశాంత్ కిషోర్ ఇచ్చే రిపోర్టులపై అపోహలు వద్దు: వైసీపీ సమావేశంలో జగన్
- పార్టీ బలోపేతానికి ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా పనిచేస్తుంది
- వర్గ రాజకీయాలు లేకుండా కలిసికట్టుగా ఉండాలి
- పార్టీ నేతలు, నాయకులకు సూచించిన జగన్
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇచ్చే రిపోర్టులపై ఎటువంటి అపోహలు వద్దని పార్టీ నేతలు, నాయకులతో వైసీపీ అధినేత జగన్ అన్నారు. హైదరాబాద్ లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియంలో వైసీపీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి ప్రశాంత్ కిషోర్ టీమ్ కూడా పని చేస్తుందని చెప్పారు. ‘రచ్చబండ’, ‘పల్లెనిద్ర’ కార్యక్రమాల ద్వారా నేతలు ప్రజల్లో ఉండాలని, పార్టీలో వర్గ రాజకీయాలు లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలకు, నాయకులకు జగన్ సూచించారు.