Congress: టీడీపీ ప్ర‌భుత్వం ముందు ఏపీ యూత్ కాంగ్రెస్ డిమాండ్లు!

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్ట‌ళ్ల‌ను ఆధునికీక‌రించాలి
  • పెరిగిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా స్కాల‌ర్‌షిప్‌లు, మెస్ ఛార్జీలు అమ‌లు చేయాలి
  • రాష్ట్రంలో విద్యా హ‌క్కు చ‌ట్టాన్ని అమ‌లు చేయాలి
  • విద్యార్థినుల‌పై రాష్ట్రంలో జ‌రుగుతున్న దాడుల‌ను అరికట్టాలి 

బాబు వ‌స్తే జాబు వ‌స్తుందం‌టూ న‌మ్మించి, అధికారంలోకి వ‌చ్చిన టీడీపీ మూడు సంవ‌త్స‌రాలుగా యువ‌త‌కు ఉపాధి క‌ల్పించ‌లేద‌ని, యువ‌త‌ను స‌ర్వే పేరుతో మోసం చేస్తోంద‌ని ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజీవ్ ర‌త‌న్‌, ఆఖిల భార‌త యువ‌జ‌న కాంగ్రెస్ కార్య‌ద‌ర్శి వ‌ర‌ప్ర‌సాద్ విమర్శించారు. విజ‌య‌వాడ‌లోని ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ రాష్ట్ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో వారు మాట్లాడుతూ.. ఇందిర‌మ్మ శ‌త జ‌యంతి ఉత్స‌వాల ముగ్గింపు సంద‌ర్భంగా ఈ నెల 28న విజ‌య‌వాడ‌లో 'మా తుజేస‌లాం' పేరుతో భారీ యుత్ స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.

టీడీపీ ఎన్నిక‌ల ముందు యువ‌త‌కు ఇచ్చిన హామీల్లో ఎన్నింటిని నేర‌వేర్చిందనే విష‌యంపై ఈ స‌ద‌స్సులో నిల‌దీస్తామ‌న్నారు.  ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేర‌కు యువ‌జ‌న కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా ఇందిరాగాంధీ శ‌త జ‌యంతి ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తుంద‌ని చెప్పారు. ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి ఆదేశాల‌తో రాష్ట్ర స్థాయి ఇందిరాగాంధీ శ‌త జ‌యంతి ఉత్స‌వాలను ఈ నెల 28వ తేదీన విజ‌య‌వాడ‌లోని ఐ.వి.ప్యాలెస్‌లో ఉద‌యం 10.00 గంట‌ల‌కు నిర్వ‌హిస్తామ‌ని చెప్పారు. ప్ర‌తి నిరుద్యోగికి రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తామ‌న్న తెలుగుదేశం ప్ర‌భుత్వం, ఆ లెక్కన ప్ర‌తి నిరుద్యోగికి బాకీ పడిన రూ.72 వేలును వెంట‌నే చెల్లించాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు..
  • ఇంట‌ర్ వ‌ర‌కు విద్యార్థుల‌కు ఉచిత బ‌స్‌పాసుల హామీల‌ను అమ‌లు చేయాలి
  • ఉచిత వై-ఫై, కంప్యూట‌ర్‌, ట్యాబ్ మ‌రియు విద్యార్థినుల‌కు సైకిళ్లు వెంట‌నే ఇవ్వాలి
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్ట‌ల్స్ ను ఆధునికీక‌రించాలి
  • పెరిగిన ధ‌ర‌ల‌కు అనుగుణంగా స్కాల‌ర్‌షిప్‌లు, మెస్ ఛార్జీలు అమ‌లు చేయాలి
  • రాష్ట్రంలో విద్యా హ‌క్కు చ‌ట్టాన్ని అమ‌లు చేయాలి
  • విద్యార్థినుల‌పై రాష్ట్రంలో జ‌రుగుతున్న దాడుల‌ను అరికట్టాలి
  • కార్పొరేట్ కళాశాల‌ల్లో విద్యార్థుల మ‌ర‌ణాలు లేకుండా ఒక ప్ర‌త్యేక జీవో అమ‌లు చేసి యాజ‌మాన్యంపై కేసులు పెట్టాలి
  • దేశ వ్యాప్త యూనివ‌ర్శిటీల్లో కాషాయిక‌ర‌ణ‌తో విద్యార్థుల జీవితాల‌తో చెల‌గాట‌మాడే వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలి
  • వివిధ నివేదికల ప్ర‌కారం ప్ర‌స్తుతం రాష్ట్రంలో 2.13 ల‌క్ష‌ల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.. ప్ర‌భుత్వం వీటిని వెంట‌నే భ‌ర్తీ చేయాలి
  • ప్రైవేట్ రంగంలో కూడా రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాలి
  • విద్య‌, ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించే విధంగా కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్ విభ‌జ‌న బిల్లులో చ‌ట్ట‌బద్ధత చేసిన హామీల‌న్నింటిని నెర‌వేర్చాలి 
ఈ స‌మావేశంలో ఏపీసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు ప‌క్కాల సూరిబాబు, మీసాల రాజేశ్వ‌ర‌రావు, న‌గర కాంగ్రెస్ అధ్య‌క్షులు ఆకుల శ్రీ‌నివాస్ కుమార్‌, యూత్ నాయ‌కులు ప్ర‌దీప్‌, ముర‌ళీ కృష్ణా, గోపి త‌దిత‌రులు పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News