రజనీకాంత్: నిజ జీవితంలో నటించమని నాకెవ్వరూ డబ్బు ఇవ్వరు!: ఓ ప్రశ్నకు రజనీ జవాబు

  • రేపు దుబాయ్ లో ‘రోబో 2.0’ ఆడియో వేడుక
  • ‘మీరు ఇంత సింపుల్ గా ఎలా ఉంటారు సార్?’ అని రజనీని ప్రశ్నించిన విలేకరులు
  • ఆసక్తికర సమాధానమిచ్చిన సూపర్ స్టార్

ప్రముఖ దర్శకుడు శంకర్ రూపొందిస్తున్న ‘రోబో 2.0’ చిత్రం ఆడియో వేడుక దుబాయ్ లో రేపు జరగనుంది. ఈ సందర్భంగా ‘రోబో 2.0’ చిత్ర బృందం అక్కడికి చేరుకుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో పాల్గొన్న రజనీకాంత్ ను విలేకరులు ఓ ఆసక్తికర ప్రశ్న అడగగా, అందుకు, ఆయన అంతే ఆసక్తికరమైన సమాధానమిచ్చారు.

 ‘మీరు ఇంత సింపుల్ గా ఎలా ఉంటారు సార్?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా, అందుకు రజనీ స్పందిస్తూ, ‘నిజ జీవితంలో నటించమని నాకు ఎవ్వరూ డబ్బు ఇవ్వరు. అందుకే, సింపుల్ గా ఉంటా’ అని అన్నారు. దీంతో అక్కడున్న వారంతా పెద్దగా నవ్వేశారు. కాగా, ‘రోబో 2.0’లో సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన అమీజాక్సన్ నటిస్తోంది. బాలీవుడ్ ప్రముఖ హీరో అక్షయ్ కుమర్ ఈ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నాడు. 

  • Loading...

More Telugu News