అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం: నవంబర్ 8 నుంచి హైదరాబాదులో అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుకలు: తలసాని

  • హైదరాబాద్ లో 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవం  
  • ఈ వేడుకలో పాల్గొననున్న 83 దేశాల ప్రతినిధులు
  • మీడియాతో మాట్లాడిన తలసాని

హైదరాబాద్ లో 20వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుకలు వచ్చే నెలలో జరగనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ వేడుకలను నవంబర్ 8 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించనున్నామని, 83 దేశాల ప్రతినిధులు పాల్గొననున్నట్టు చెప్పారు. అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను శాశ్వతంగా హైదరాబాద్ లోనే నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అంగీకరిస్తే ఓ కాంప్లెక్స్ నిర్మిస్తామని చెప్పారు.

 అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల నిమిత్తం రూ.5.5 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని, ఐమాక్స్ సహా పది థియేటర్లలో బాలల చిత్రాలను ప్రదర్శించనున్నట్టు చెప్పారు. బాలల చలన చిత్రోత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర పండగగా గుర్తించే అంశం పరిశీలనలో ఉన్నట్టు ఈ సందర్భంగా తలసాని చెప్పారు.

  • Loading...

More Telugu News