‘లక్ష్మీస్ వీరగ్రంథం’: ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ ఫస్ట్ లుక్ పై రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యలు!
- ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ ఫస్ట్ లుక్ పై స్పందించిన వర్మ
- ‘తానెవరో నాకు తెలియదు కానీ, వీపు మాత్రం బాగుంది’
- ‘ఫేస్ బుక్’ ఖాతాలో వర్మ పోస్ట్
‘లక్ష్మీస్ వీరగ్రంథం’ పేరిట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రకటించడం, ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం తెలిసిందే. లక్ష్మీపార్వతి తన మొదటి భర్త వీరగంధం సుబ్బారావును వీడి ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించిందనే విషయాలను తెరకెక్కిస్తానని జగదీశ్వరరెడ్డి ప్రకటించడం విదితమే. ఈ నేపథ్యంలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కించనున్న ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా ఓ పోస్ట్ చేశారు. ‘లక్ష్మీస్ వీర గ్రంథం’ ఫస్ట్ లుక్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘తానెవరో నాకు తెలియదు కానీ వీపు మాత్రం బాగుంది’ అని వర్మ తనదైన శైలిలో పేర్కొన్నారు.