లక్ష్మీపార్వతి: యథార్థ సంఘటనలతోనే ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ నిర్మిస్తాం: దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి

  • ఎన్టీఆర్ రెండో భార్యగా లక్ష్మీపార్వతి ఎలా ప్రవేశించిందో ప్రజలకు తెలియాలి
  • వెంకన్న సన్నిధిలో ప్రారంభోత్సవం చేస్తాం
  • నవంబర్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్
  • 2018లో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ విడుదల చేస్తాం
  • ఓ ఇంటర్వ్యూలో కేతిరెడ్డి జగదీశ్వరెడ్డి

ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తీయనున్నట్టు తమిళనాడు తెలుగు యువశక్తి  అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ పేరుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ, ‘ఎన్టీఆర్ జీవితంలో మొదటి భాగం, ఆఖరి భాగం కాకుండా ఆ మధ్యలో జరిగిన విషయాలను తెరకెక్కిస్తా. ఈ విషయాలు ప్రజలకు తెలియవు. లక్ష్మీపార్వతి మొదటి భర్త వీరగంధం సుబ్బారావు గారు హరికథలు చెప్పుకునేందుకు వాడవాడలా తిరిగారు.

ఇక ఎన్టీఆర్ రెండో భార్యగా ఆయన జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎలా ప్రవేశించారన్న విషయం ప్రజలకు తెలియాల్సి ఉంది. తిరుపతిలోని వెంకన్న సన్నిధిలో ప్రారంభోత్సవం చేసి, నవంబర్ రెండో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతాం. ఈ చిత్రంలో పాత్రల పరంగా చూస్తే నటి వాణీవిశ్వనాథ్ ను ఈ సినిమా నిర్మాత విజయ్ కుమార్ గౌడ్ కలిశారు. ఈ చిత్రంలో హీరో ఎవరనేది త్వరలో నిర్ణయిస్తాం. వీరగంధం సుబ్బారావు పాత్రకు నటుడు ఎల్బీ శ్రీరామ్ అని అనుకుంటున్నాం.

యథార్థ సంఘటనల ఆధారంగానే ఈ సినిమాను నిర్మిస్తాం. లక్ష్మీపార్వతి, వీరగంధం సుబ్బారావు గారి జీవిత చరిత్రలను తెలుసుకుంటున్నాం. లక్ష్మీ పార్వతి తన మొదటి భర్త వీరగంధం సుబ్బారావుని వదిలి సూట్ కేస్ తో బయటకు రావడంతో సినిమా మొదలై, ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ప్రవేశించడంతో ఈ సినిమా ముగుస్తుంది. ఈ చిత్రంలో మూడు పాటలు, హరికథతో పాటు కొన్ని శ్లోకాలు కూడా వుంటాయి. 2018లో లక్ష్మీస్ వీరగంధం సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’ అని జగదీశ్వర్ రెడ్డి వివరించారు.  

  • Loading...

More Telugu News