బొత్స: బొత్స, ష‌బ్బీర్ అలీ లను త‌న స్నేహితులుగా పేర్కొన్న స‌తీశ్ సానా

  • మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీ మనీ ల్యాండరింగ్‌ కేసు
  • స‌తీశ్ సానా, కోనేరు ప్ర‌దీప్ వాంగ్మూలాన్ని తీసుకున్న అధికారులు
  • ష‌బ్బీర్ అలీ, బొత్స స‌త్య‌నారాయ‌ణ త‌న స్నేహితుల‌ని చెప్పిన స‌తీశ్ సానా

వివాదాస్పద మాంసం వ్యాపారి మొయిన్‌ ఖురేషీ మనీ ల్యాండరింగ్‌ కేసుపై చార్జిషీటు దాఖలు చేసిన ఈడీ విచార‌ణ ప్రారంభించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న‌ స‌తీశ్ సానా, కోనేరు ప్ర‌దీప్ వాంగ్మూలాన్ని తీసుకుంది. స‌తీశ్ సానా ఇచ్చిన‌ వాంగ్మూలంలో కాంగ్రెస్ నేత‌ ష‌బ్బీర్ అలీ పేరుతో పాటు వైసీపీ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ పేరు కూడా బ‌య‌ట‌కు వచ్చింది. వారిద్ద‌రు త‌న స్నేహితుల‌ని ఆయ‌న అన్నారు.

సుఖేష్ గుప్తాకు బెయిల్ కోసం అప్ప‌టి సీబీఐ డైరెక్ట‌ర్ రంజిత్ సిన్హాను ఖురేషి పలుసార్లు క‌లిశారని చెప్పారు. ప‌లువురు వ్య‌క్తుల నుంచి రూ.11.09 కోట్లు వ‌సూలు చేసిన‌ట్లు, కోనేరు ప్ర‌దీప్ రూ.7.25 కోట్లను ఖురేషికీ అందించిన‌ట్లు పేర్కొన్నారు. అలాగే ఆయా నిందితుల‌ మ‌ధ్య ఫోనులో జ‌రిగిన సంభాష‌ణ‌ను కూడా అధికారులు సేక‌రించారు.

  • Loading...

More Telugu News