తిరుమల: తిరుమలలో కొండచిలువ క‌ల‌క‌లం.. పట్టించుకోని అధికారులు!

  •  భ‌యాందోళ‌న‌ల‌కు గురైన భ‌క్తులు
  •  ఫిర్యాదు ఇచ్చినా ప‌ట్టించుకోని అటవీశాఖ అధికారులు
  •  స్థానికులే కొండ చిలువను పట్టుకుని, అటవీ ప్రాంతంలో విడిచి పెట్టిన వైనం

తిరుమలలోని బాలాజీనగర్‌ కాలనీలో కొండచిలువ క‌ల‌క‌లం రేపింది. కొండ చిలువ క‌న‌ప‌డ‌డంతో భక్తులు భ‌యాందోళ‌న‌ల‌కు గురై పరుగులు తీశారు. ఈ విషయమై స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించినా ఫ‌లితం లేకుండా పోయింది. ఈ ఘ‌ట‌న‌పై ఫిర్యాదు అందుకున్న‌ప్ప‌టికీ వారు అక్క‌డి రాలేదు.

దీంతో స్థానికులే కొండ చిలువను పట్టుకుని, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఆ కొండ చిలువను చూసేందుకు స్థానికులు భారీ సంఖ్య‌లో అక్క‌డ‌కు వ‌చ్చారు. తిరుమ‌ల‌లోకి వన్యప్రాణులు, క్రూర మృగాలు త‌రుచూ వస్తున్నాయి. దీంతో భ‌క్తులు ఆందోళ‌న చెందుతున్నారు.   

  • Loading...

More Telugu News