పరుచూరి గోపాలకృష్ణ: వాళ్లిద్దరూ మళ్లీ పుడితే సినీ పరిశ్రమ చాలా బాగుంటుంది: పరుచూరి గోపాలకృష్ణ

  • ఏఎన్నార్, ఎన్టీఆర్ మళ్లీ పుట్టాలని కోరుకుంటున్నా
  • నటనకే నిఘంటువు అక్కినేని
  • ‘పరుచూరి పలుకులు’లో గోపాలకృష్ణ

వాళ్లిద్దరూ..అక్కినేని నాగేశ్వరరావు, నందమూరి తారక రామారావు మళ్లీ పుడితే సినీ పరిశ్రమ చాలా బాగుంటుందని తన విశ్వాసమని ప్రముఖ మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. ‘పరుచూరి పలుకులు’ వీడియోలో అక్కినేనితో తన అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, ‘నాగేశ్వరరావు గారు నటనకే నిఘంటువు. అద్భుతమైన వారసత్వాన్ని ఆయన ఇచ్చి వెళ్లారు. అన్నపూర్ణా స్టూడియోకి వెళితే, నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణమ్మ గారు గుర్తొస్తుంటారు. మేము ముంబైలో ఉన్నప్పుడు జరగరాని ఘోరం జరిగిపోయింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు రెండో కన్ను(అక్కినేని) మూతపడిపోయింది. నాడు అక్కినేని మృతి వార్త తెలిసి ముంబై నుంచి తక్షణం వచ్చాం. మళ్లీ అక్కినేని, అన్నగారు (ఎన్టీఆర్) పుడితే సినీ పరిశ్రమ చాలా బాగుంటుందని నా విశ్వాసం..’ అని పరుచూరి అన్నారు.

  • Loading...

More Telugu News