క్రికెట్: రెండో వ‌న్డే: భార‌త్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ

  • ల‌క్ష్య‌ ఛేద‌న‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా
  • 22 ప‌రుగులకే మొద‌టి వికెట్‌ డౌన్
  • రోహిత్ శ‌ర్మ 7 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద‌ ఔట్

భార‌త్‌, న్యూజిలాండ్ మ‌ధ్య జ‌రుగుతోన్న రెండో వ‌న్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. టీమిండియా ముందు 231 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన విష‌యం తెలిసిందే. ల‌క్ష్య‌ ఛేద‌న‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 22 ప‌రుగులకే మొద‌టి వికెట్‌ను కోల్పోయింది. రోహిత్ శ‌ర్మ 7 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద‌ టిమ్ సౌతీ బౌలింగ్‌లో కోలిన్ మ‌న్రోకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం క్రీజులో మ‌రో ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్ 25, విరాట్ కోహ్లీ 11 ప‌రుగుల‌తో ఉన్నారు. టీమిండియా స్కోరు ఏడు ఓవ‌ర్ల‌కి ఒక వికెట్ న‌ష్టానికి 48 గా ఉంది. 

  • Loading...

More Telugu News