మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్వీట్ పై విమర్శలు!
- అమెరికా పర్యటనకు వెళ్లిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
- వాషింగ్టన్ రోడ్ల కన్నా మధ్యప్రదేశ్ రహదారులే మేలని ట్వీట్
అమెరికా పర్యటనకు వెళ్లిన మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్.. ఓ ట్వీట్ చేసి విమర్శల పాలవుతున్నారు. తాను వాషింగ్టన్‌లో ఎయిర్‌పోర్ట్ నుంచి బయటకు రాగానే అక్కడి రోడ్లను పరిశీలించానని చెప్పారు. అయితే, అక్కడి రోడ్ల కన్నా మధ్యప్రదేశ్ రహదారులే మేలని తనకు అనిపించిందని చెప్పారు. తమ రాష్ట్రంలో టూరిజంను ప్రమోట్ చేసే పనిపై ఆయన అమెరికాలో పర్యటిస్తున్నారు.
అయితే, శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ట్వీట్‌పై నెటిజన్లు చురకలంటిస్తున్నారు. వాషింగ్టన్ రోడ్లు, మధ్య ప్రదేశ్ రోడ్ల ఫొటోలను పోస్ట్ చేస్తూ ఎద్దేవా చేస్తున్నారు. వర్షపు నీళ్లన్నీ రోడ్డుపైకి వచ్చేస్తే ఆయనను పోలీసులు ఎత్తుకెళ్లిన ఫొటోలను పోస్ట్ చేస్తూ విమర్శిస్తున్నారు.