నన్నపనేని రాజకుమారి: హింసను ప్రేరేపించే టీవీ సీరియళ్లను కట్టడి చేయాలి: నన్నపనేని రాజకుమారి

  • నేర ప్రవృత్తిని, హింసను, అశ్లీలతను పెంచేలా ఉన్న కార్యక్రమాలను అదుపు చేయాలి
  • సెన్సార్ విధానం తీసుకురావాలి
  • ఢిల్లీలో రాష్ట్రాల మహిళా సంఘాల అధ్యక్షుల సమావేశంలో నన్నపనేని డిమాండ్

ఇటీవలి కాలంలో కొన్ని టీవీ ఛానళ్లు, సీరియళ్ల తీరు నేర ప్రవృత్తిని, హింసను పెంచేలా ఉన్నాయని, వాటిని అదుపు చేసేందుకు సెన్సార్  విధానం తీసుకురావాలని ఏపీ మహిళా కమిషన్ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి డిమాండ్ చేశారు. జాతీయ మహిళా సంఘం ఇన్ ఛార్జి చైర్ పర్సన్ రేఖాశర్మ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రారంభమైన రాష్ట్రాల మహిళా సంఘాల అధ్యక్షుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. టీవీ సీరియళ్లలో మహిళలను విలన్లుగా చూపించే వాతావరణం పెరిగిపోయిందని, అశ్లీలత, నేరస్వభావం పెంచేలా ఉండే కార్యక్రమాలను నియంత్రించాలని ఆమె కోరారు.

 రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, గృహహింస, పని చేసే ప్రాంతాల్లో జరుగుతున్న అఘాయిత్యాల నివారణకు ప్రభుత్వపరంగా చేపట్టాల్సిన చర్యలే అజెండాగా ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీలోని స్థితగతుల గురించి రాజకుమారి వివరించారు. ప్రభుత్వం పరంగా సీఎం చంద్రబాబు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందిస్తున్న సాయంపై లిఖితపూర్వకంగా ఒక పత్రం సమర్పించారు. మహిళలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన కేసుల్లో శిక్షల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని రాజకుమారి కోరారు.

  • Loading...

More Telugu News