క్రికెట్: పూణే వన్డే: నాలుగు వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్

  • రెండో వ‌న్డేలో టీమిండియా బౌల‌ర్ల విజృంభణ
  • ప్ర‌స్తుతం న్యూజిలాండ్ స్కోరు నాలుగు వికెట్ల‌కి 63 ప‌రుగులు
  • రెండు వికెట్లు తీసిన భువీ

పూణేలో జ‌రుగుతోన్న భార‌త్‌, న్యూజిలాండ్ రెండో వ‌న్డేలో టీమిండియా బౌల‌ర్లు విజృంభిస్తున్నారు. బ్యాటింగ్ చేస్తోన్న న్యూజిలాండ్ 58 ప‌రుగుల‌కే నాలుగో వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌లో మార్టిన్ గుప్తిల్ 11, కోలిన్ మున్‌రో 10, కానె విలియ‌మ్స‌న్ 3, టైల‌ర్ 21 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద ఔట‌య్యారు. ప్ర‌స్తుతం క్రీజులో  టామ్ లాథ‌మ్ 11, హెన్రీ నికోల్స్ 0 ప‌రుగుల‌తో ఉన్నారు. టీమిండియా బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ 2 వికెట్లు తీయ‌గా, బుమ్రా, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీశారు. ఇక న్యూజిలాండ్‌ భారమంతా ఇప్పుడు మిడిల్ ఆర్డ‌ర్ బ్యాట్స్‌మెన్‌పైనే ప‌డింది. ప్ర‌స్తుతం న్యూజిలాండ్ స్కోరు నాలుగు వికెట్ల‌కి 17 ఓవర్లకి 63 ప‌రుగులుగా ఉంది.

  • Loading...

More Telugu News