తాజ్ మహల్: ‘తాజ్ మహల్’ చుట్టూ ఉన్న పార్కింగ్ ప్రాంతాన్ని తొలగించాలి: ‘సుప్రీం’ ఆదేశాలు
- పార్కింగ్ కారణంగా పర్యావరణ కాలుష్యం ఏర్పడే ప్రమాదం
- తాజ్ మహల్ సంరక్షణ నిమిత్తం ‘సుప్రీం’ ఆదేశాలు
- గతంలోనూ యూపీ సర్కార్ ని హెచ్చరించిన ఉన్నత న్యాయస్థానం
ఆగ్రాలోని చారిత్రక కట్టడం తాజ్ మహల్ చుట్టూ ఉన్న పార్కింగ్ ప్రాంతాన్ని వెంటనే తొలగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్కింగ్ కారణంగా పర్యావరణ కాలుష్యం ఏర్పడే ప్రమాదం ఉండటంతో తాజ్ మహల్ ను సంరక్షించే నిమిత్తం ఈ ఆదేశాలు జారీ చేసినట్టు సుప్రీంకోర్టు పేర్కొంది.
కాగా, గత ఆగస్టులోనూ తాజ్ మహల్ విషయమై యూపీ సర్కార్ ని సుప్రీంకోర్టు మందలించింది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కట్టడాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నారా? అంటూ ప్రశ్నించింది. మధుర - ఢిల్లీ మధ్య అదనపు రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం సుమారు నాలుగు వందల చెట్లను నరికి వేసేందుకు అనుమతి నిమిత్తం యూపీ ప్రభుత్వం ఇటీవల దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తును విచారిస్తున్న సమయంలోనూ యూపీ సర్కార్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.