పంచుమర్తి అనూరాధ: వ్యాపారం చేసినా రాజకీయం చేసినా జగన్ ది తప్పుడు దారే: టీడీపీ నేత పంచుమర్తి అనూరాధ

  • అసెంబ్లీ సమావేశాలకు జగన్ రాననడం సబబు కాదు
  • పాదయాత్ర పేరిట విధ్వంసాలు సృష్టిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు
  • జగన్ తీరు నచ్చకే వైసీపీ నాయకులు బయటకొచ్చేస్తున్నారు
  • టీడీపీ నాయకురాలు అనూరాధ విమర్శలు

వ్యాపారం చేసినా, రాజకీయం చేసినా జగన్ ది తప్పుడు దారేనని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనూరాధ ఆరోపించారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై చర్చకు వేదికైన అసెంబ్లీకి రానంటున్న జగన్ పాదయాత్రకు ఎలా వెళతారని ప్రశ్నించారు. పాదయాత్ర పేరుతో విధ్వంసాలు సృష్టిస్తే పోలీసులు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. జగన్ పద్ధతి నచ్చకే ఆ పార్టీలోని సగం మంది నాయకులు బయటకు వచ్చేశారని విమర్శించారు.

  • Loading...

More Telugu News