గరుడ వేగ: ఇప్పుడు, అదృష్టాన్ని కూడా నమ్ముతున్నా: హీరో రాజశేఖర్

  • నేను చాలా బ్యాడ్ పీరియడ్ లో ఉన్న సమయంలో ‘గరుడవేగ’లో అవకాశం లభించింది
  • ఈ సినిమాలో అవకాశం రావడం అదృష్టం 
  • ఈ నెల 27న ప్రీ రిలీజ్ వేడుక ..ఆ రోజునే సన్నీలియోన్ స్టేజ్ పర్ఫార్మెన్స్
  • హీరో రాజశేఖర్ వెల్లడి

ఒకప్పుడు అదృష్టాన్ని నమ్మేవాడిని కాదని, కేవలం కష్టపడే తత్వాన్ని మాత్రమే నమ్మేవాడినని ప్రముఖ హీరో రాజశేఖర్ అన్నారు. ‘గరుడ వేగ’ చిత్రంలోని ‘ప్రేమలే..’ పాట ఆవిష్కరణ సందర్భంగా ‘రేడియో సిటీ’ కార్యాలయానికి ఆయన వెళ్లారు. పాట ఆవిష్కరణ అనంతరం రాజశేఖర్ మాట్లాడుతూ, ‘నేను చాలా బ్యాడ్ పీరియడ్ లో ఉన్న సమయంలో నాతో ఇంత భారీ బడ్జెట్ సినిమాను నిర్మించేందుకు ముందుకు రావడం సంతోషం.

ఇంతవరకూ నేను కష్టపడేతత్వాన్ని తప్పా, అదృష్టాన్ని నమ్మేవాడిని కాదు. కానీ, ఇప్పుడు అదృష్టాన్ని కూడా నమ్మాల్సి వస్తోంది. ఈ సినిమాలో హీరోగా నటించే అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ప్రస్తుతం ‘గరుడ వేగ’ ప్రచార కార్యక్రమాల్లో ఉన్నాం. ఈ నెల 27న ‘గరుడ వేగ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నాం. ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజున సన్నీలియోన్ గారి స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంది. వచ్చే నెల 3న ఈ చిత్రం రిలీజ్ చేస్తున్నాం’ అని అన్నారు.

  • Loading...

More Telugu News