సూసైడ్: తెనాలి 'చంద్రబాబు నాయుడు కాలనీ'లో అలజడి.. మంచినీటి ట్యాంకు పై నుంచి దూకి, యువతి ఆత్మ‌హ‌త్య!

  • ఆ యువ‌తి పేరు అనీలా లాజ‌ర్ అని గుర్తించిన పోలీసులు
  • ఆమె గుంటూరు వైద్య క‌ళాశాల‌లో చ‌దువుతోంద‌ని సమాచారం
  • ఆ విద్యార్థిని ఆత్మ‌హ‌త్యకు గ‌ల కార‌ణాల‌పై పోలీసులు ఆరా

గుంటూరు జిల్లా తెనాలిలోని 'చంద్రబాబు నాయుడు కాలనీ'లో ఈ రోజు సాయంత్రం క‌లక‌లం చెల‌రేగింది. ఆ కాల‌నీలోని మంచి నీటి ట్యాంక్‌పైకి ఎక్కిన ఓ యువ‌తి కింద‌కు దూకేసింది. ర‌క్త‌పు మ‌డుగులో ఆమె అక్క‌డిక‌క్క‌డే చ‌నిపోయిన‌ట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఆ యువ‌తి పేరు అనీలా లాజ‌ర్ అని గుర్తించారు. ఆమె గుంటూరు వైద్య క‌ళాశాల‌లో చ‌దువుతోంద‌ని చెప్పారు. అనీలా లాజ‌ర్ స్వ‌స్థ‌లం కాకినాడ‌లోని ఎల్విన్ పేట‌గా గుర్తించారు. చ‌దువు ఒత్తిడి వ‌ల్లే ఆమె ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డింద‌ని భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News