ఆదినారాయణ: నా రాజీనామా ఆమోదిస్తే మళ్లీ నా సత్తా చూపిస్తా: మంత్రి ఆదినారాయణరెడ్డి
- జగన్ పాదయాత్ర ముగిసేలోపు అక్రమాస్తుల కేసుల్లో అరెస్టు కావడం ఖాయం
- జగన్ పాదయాత్ర చేస్తే మాకు అభ్యంతరాలు లేవు
- తమ ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే భయం జగన్ లో ఉంది
తన రాజీనామా ఆమోదిస్తే తన నియోజక వర్గంలో మళ్లీ పోటీకి దిగి సత్తా చూపిస్తానని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆదినారాయణరెడ్డి ఉద్ఘాటించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.... మరికొన్ని రోజుల్లో పాదయాత్ర ప్రారంభించనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై మండిపడ్డారు.
జగన్ పాదయాత్ర ముగిసేలోపు అక్రమాస్తుల కేసుల్లో అరెస్టు కావడం ఖాయమని అన్నారు. జగన్ పాదయాత్రలు చేస్తే తమకేం అభ్యంతరాలు లేవని చెప్పుకొచ్చారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బహిష్కరించాలనే నిర్ణయం వెనుక జగన్ కుట్ర ఉందని ఆయన చెప్పారు. తన ఎమ్మెల్యేలు పార్టీ మారతారనే భయంతోనే జగన్ ఆ నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు.