ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై లడ్డూ ధర రూ.10 పెంపు.. తలనీలాల టిక్కెట్ ధర ఇకపై రూ.20
- విజయవాడలో దుర్గగుడి పాలకమండలి సమావేశం
- కీలక నిర్ణయాలు తీసుకున్న పాలకమండలి
- శ్రీచక్ర లడ్డూ ధర ఇకపై రూ.100కే
విజయవాడలో ఈ రోజు దుర్గగుడి పాలకమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దుర్గగుడి లడ్డూ ధరను రూ.10 నుంచి 20కి పెంచనున్నట్లు తెలిపారు. అలాగే శ్రీచక్ర లడ్డూను భక్తులందరికీ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుని, దాని ధరను రూ.100గా ఖరారు చేశారు. తలనీలాల టిక్కెట్ ధర రూ.15 నుంచి రూ.20కి పెంచుతున్నట్లు పేర్కొన్నారు.
సమావేశంలో తీసుకున్న ఇతర నిర్ణయాలు..
- మల్లికార్జున మహామండపం, కనకదుర్గనగర్‌లో భక్తుల కోసం 2 షెడ్ల ఏర్పాటు
- మల్లికార్జున మహామండపం ద్వారా వచ్చేవారికి ప్రస్తుతానికి ఉచితంగా లిఫ్ట్ సౌకర్యం
- దసరా ఉత్సవాల్లో పనిచేసిన వారికి ప్రోత్సాహకంగా రూ.5 వేలు