ఆర్యవైశ్యులు: విజయవాడలో ఆర్యవైశ్య-బ్రాహ్మణ సంఘాలు, కంచ ఐలయ్య మద్దతుదారుల పోటీ సమావేశాలు!

  • ఈ నెల 28న విజయవాడ వేదికగా రెండు సంఘాల సమావేశాలు
  • అనుమతి కోసం పోలీసులకు విన్నపం
  • తర్జనభర్జనలో పోలీస్ యంత్రాంగం

విజయవాడ వేదికగా ఆర్యవైశ్యులు-కంచ ఐలయ్య మద్దతుదారులు పోటీ సమావేశాలు నిర్వహించనున్నారు. సామాజిక జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 28న కంచ ఐలయ్యకు అభినందన సభ నిర్వహించనున్నారు. అదే రోజున ఆర్యవైశ్య-బ్రాహ్మణ సంఘాలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశాయి. విజయవాడలోని జింఖానా గ్రౌండ్ లో సభ నిర్వహణ కోసం ఇరువర్గాలు పోలీసుల అనుమతి కోరాయి.

దీంతో, ఒకే రోజు ఒకే చోట రెండు సంఘాలు అనుమతి కోరడంతో పోలీసుల తర్జనభర్జన పడుతున్నారు. ఒకేచోట అనుమతిస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసులు భావిస్తున్నారు. జింఖానా గ్రౌండ్ లోనే సభ నిర్వహించి తీరుతామని ఇరువర్గాలు చెబుతుండటం గమనార్హం. చివరికి పోలీసులు ఏ నిర్ణయం తీసుకుంటారో! 

  • Loading...

More Telugu News