కోమటిరెడ్డి వెంకట రెడ్డి: రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్పా ఎవరూ సంతోషంగా లేరు: కోమటిరెడ్డి
- ప్రజలను తాగుబోతులుగా మారుస్తున్న ప్రభుత్వం
- రైతులను ఎన్నో విధాలుగా మోసం చేసిన కేసీఆర్
- ఈ నెల 27న ‘ఛలో అసెంబ్లీ’
- లక్షలాదిగా తరలి రావాలని వెంకటరెడ్డి పిలుపు
రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం తప్పా ఎవరూ సంతోషంగా లేరని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఈ నెల 27న తలపెట్టిన ‘ఛలో అసెంబ్లీ’కి లక్షలాదిగా తరలి రావాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులను కేసీఆర్ ఎన్నో విధాలుగా మోసం చేస్తున్నారని, రైతులను ప్రభుత్వం ఆదుకునే వరకూ పోరాటం చేస్తామని అన్నారు. ప్రజలను తాగుబోతులుగా మార్చి, రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.