రాహుల్ గాంధీ: అది గబ్బర్‌ సింగ్‌ టాక్స్ : 'జీఎస్టీ'కి కొత్త భాష్యం చెప్పిన రాహుల్ గాంధీ

  • గుజరాత్‌లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ
  • నోట్ల రద్దు దారుణంగా విఫలమైంది
  • మేకిన్‌ ఇండియా కూడా విఫలమైంది
  • క‌ళాశాల‌ల‌ను, యూనివర్సిటీలను ప్ర‌భుత్వం పారిశ్రామికవేత్తల చేతిలో పెట్టింది

జీఎస్టీ అంటే గబ్బర్‌ సింగ్‌ టాక్స్ అని ఏఐసీసీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ చుర‌క‌లంటించారు. గుజరాత్‌లో ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతోన్న వేళ‌.. రాహుల్‌ గాంధీ ఆ రాష్ట్రంలో ప‌ర్య‌టిస్తున్నారు. ఈ సందర్భంగా బ‌హిరంగ స‌భ‌లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ... ప్ర‌ధాని మోదీ చేసిన‌ నోట్ల రద్దు దారుణంగా విఫలమైందని విమ‌ర్శించారు. మ‌రోవైపు మేకిన్‌ ఇండియా కూడా విఫలమైందని అన్నారు. అలాగే బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కుమారుడు జయ్‌షాపై ఓ వార్తా వెబ్‌సైట్ ప్ర‌చురించిన అక్ర‌మాస్తుల ఆరోప‌ణ క‌థ‌నంపై రాహుల్ గాంధీ స్పందిస్తూ విమ‌ర్శ‌లు చేశారు.

కాగా, భార‌తీయ జ‌న‌తా పార్టీ సామాన్యులకు చదువును అంద‌కుండా చేసిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఎందుకంటే క‌ళాశాల‌ల‌ను, యూనివర్సిటీలను ప్ర‌భుత్వం పారిశ్రామికవేత్తల చేతిలో పెట్టింద‌ని అన్నారు. గుజ‌రాత్‌ ఎన్నికల తేదీలను ప్రకటించాలని రాహుల్‌ గాంధీ ఈసీని డిమాండ్‌ చేశారు.

  • Loading...

More Telugu News