రేవంత్ రెడ్డి: రేవంత్ రెడ్డి వివరణ కోసం ఎదురు చూస్తున్నాం: టీడీపీ నేత రేవూరి

  • మీడియాతో మాట్లాడిన రేవూరి ప్రకాష్ రెడ్డి
  • పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతున్న నేతల పేర్లతో జాబితా
  • రేవంత్ వ్యవహారంపై చంద్రబాబుకు నివేదిక పంపాం

రేవంత్ రెడ్డి పార్టీ మారతారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన వివరణ కోసం ఎదురుచూస్తున్నామని తెలంగాణ టీడీపీ నేత రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నిన్న జరిగిన టీ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశానికి రేవంత్ రెడ్డిని పిలవలేదని చెప్పారు. రేవంత్ రెడ్డికి టీడీపీ అనేక అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు.

కాగా, రేవంత్ రెడ్డి వ్యవహారంపై చంద్రబాబుకు నివేదిక పంపాలని టీటీడీపీ పొలిట్ బ్యూరో తీర్మానించింది. పార్టీ మారుతున్నట్టు ప్రచారం జరుగుతున్న వారి పేర్లతో సిద్ధం చేసిన జాబితాను చంద్రబాబుకు పంపినట్టు సమాచారం. పార్టీ మారే వ్యవహారంపై కొడంగల్ లో రేవంత్ రెడ్డి ఇచ్చిన వివరణతో పార్టీ సీనియర్లు సంతృప్తి చెందలేదు. రేవంత్ పై తక్షణమే వేటు వేయాలని మోత్కుపల్లి బృందం డిమాండ్ చేసింది. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగానే రేవంత్ రెడ్డిపై వేటు వేస్తారనే ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News