డొనాల్డ్ ట్రంప్: డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అవుతా.. ఉ.కొరియా గురించి చర్చలు జరుపుతా: షింజో అబే
- పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన సందర్భంగా షింజో అబే ప్రసంగం
- జపాన్ ప్రజల రక్షణను కోరుకుంటున్నా
- ఉత్తర కొరియాను నియంత్రించేందుకు చర్యలు
దుందుడుకు చర్యలకు పాల్పడుతూ తమ దేశానికి ముప్పుగా మారుతోన్న ఉత్తరకొరియా అంశంపై జపాన్ ప్రధాని షింజో అబే మరోసారి స్పందించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఉత్తర కొరియాను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయనతో ఉత్తరకొరియా అంశాన్ని చర్చిస్తానని అన్నారు. అంతేగాక, ఉత్తరకొరియా అంశంపై రష్యా, చైనాతోనూ సంప్రదింపులు జరుపుతానని పేర్కొన్నారు. ఉత్తరకొరియాపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తామని అన్నారు. తాను తమ దేశ ప్రజల రక్షణను కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు.