‘మహానుభావుడు’: ‘మహానుభావుడు’కి సుమంత్ ప్రశంసలు!
- ‘మహానుభావుడు’ని చూశాను
- నాకు కూడా కొంచెం ఓసీడీ ఉండటంతో బాగా ఎంజాయ్ చేశా
- ట్వీట్ లో సుమంత్
మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మహానుభావుడు’ చిత్రం తనకు బాగా నచ్చిందని ప్రముఖ నటుడు సుమంత్ ప్రశంసించారు. ఈ సందర్భంగా చేసిన ఓ ట్వీట్ లో ‘ నాకు కూడా కొంచెం ఓసీడీ ఉందని తెలిశాక, ‘మహానుభావుడు’ని బాగా ఎంజాయ్ చేశా. శర్వానంద్, దర్శకుడు మారుతిలకు, యూవీ క్రియేషన్స్ చిత్ర యూనిట్ కి నా అభినందనలు’ అని పేర్కొన్నాడు. కాగా, ‘మహానుభావుడు’ చిత్రంలో శర్వానంద్ కి ఓసీడీ (చేసిన పనే మళ్లీ మళ్లీ చేసే చాదస్తం) అనే మానసిక వ్యాధి ఉంటుంది.