పాకిస్థాన్ జర్నలిస్ట్: పాక్ జర్నలిస్టుతో ప్రేమా? స్నేహమా?: పంజాబ్ ముఖ్యమంత్రిపై విమర్శలు
- పాకిస్థాన్ జర్నలిస్ట్ అరూసాతో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సెల్ఫీ
- విమర్శలు చేస్తోన్న ప్రతిపక్ష పార్టీల నేతలు
- తమ మధ్య ప్రేమ లేదని, స్నేహితులం మాత్రమేనని గతంలో స్పష్టం చేసిన పాక్ జర్నలిస్టు
పాకిస్థాన్ జర్నలిస్ట్ అరూసాతో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ స్నేహాన్ని కొనసాగిస్తుండడం పట్ల విమర్శలు వస్తోన్న వేళ బయటపడిన ఓ ఫొటో మరింత అలజడి రేపుతోంది. ఇటీవల అమరీందర్ సింగ్ కారులో వెళుతుండగా.. తన వెనుక సీట్లో కూర్చున్న అరూసాతో ఆయన సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీతో వారి బంధం మరోసారి బయటపడిందని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు చేస్తున్నారు. ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో అమరీందర్ సింగ్.. పాక్ జర్నలిస్టుతో సంబంధంపై మరోసారి అభాసు పాలవుతున్నారు.
తనకు అమరీందర్ సింగ్‌తో సంబంధాలు ఉన్నాయని వస్తోన్న విమర్శలను గతంలో చంఢీగఢ్‌లో జరిగిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అరూసా ఖండించారు. తమ మధ్య ప్రేమ లేదని, స్నేహితులం మాత్రమేనని ఆమె అన్నారు. తమ స్నేహం ఎప్పటికీ కొనసాగుతుందని చెప్పారు. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి అయిన తరువాత పలు ముఖ్య కార్యక్రమాల్లో ఆయనతో కలిసి ఆమె కనిపించారు.