సోమిరెడ్డి: రాజకీయ పార్టీ నడిపే అర్హత జగన్ కు లేదు: మంత్రి సోమిరెడ్డి
- జగన్ పాదయాత్రలు చేయాల్సిన అవసరం లేదు
- నిందితుడు జగన్ ప్రతిపక్ష నేత హోదాలో పలు సౌకర్యాలు అనుభవించడం తగదు
- పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని జగన్ కు సూచన
పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వైసీపీ అధినేత జగన్ కు రాజకీయ పార్టీ నడిపే అర్హత లేదని ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జగన్ కు నైతిక విలువలు కనుక ఉంటే, పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాలని, ప్రతిపక్ష నేతగా మరొకరిని నియమించాలని హితవు పలికారు. పన్నెండు కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్, ప్రతిపక్ష నేత హోదాలో పలు సౌకర్యాలను అనుభవించడం ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. ఈ కేసుల నుంచి జగన్ బయటపడే వరకు పాదయాత్రలు చేయాల్సిన అవసరం లేదని జగన్ కు సూచించారు.