బంగారం ధర: మరో రూ.200 పడిపోయిన బంగారం ధర
- రూ.200 తగ్గి రూ.30,450గా నమోదైన 10 గ్రాముల పసిడి ధర
- రూ.50 పెరిగి రూ.40,900గా నమోదైన కిలో వెండి ధర
అంతర్జాతీయ పరిస్థితులు, స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్లు తగ్గిపోవడంతో ఈ రోజు కూడా పసిడి ధరలు నేల చూపులు చూశాయి. పది గ్రాముల బంగారం ధర రూ.200 తగ్గి, రూ.30,450గా నమోదైంది. కాగా, పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి కొనుగోళ్లు అధికమవడంతో వెండి ధర పెరిగింది.
దీంతో మార్కెట్లో కిలో వెండి ధర రూ.50 పెరిగి రూ.40,900గా నమోదైంది. గ్లోబల్ మార్కెట్లో పసిడి ధర 0.41 శాతం తగ్గి, ఔన్సు 1,274.80 డాలర్లు పలికింది. భారత్ లో పండుగ సీజన్ నేపథ్యంలో మూడు రోజుల క్రితం వరకు పసిడి ధర పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే.