అబుదాబి: ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని అల్లాను ప్రార్థించా: అబుదాబిలో చంద్రబాబు
- విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు
- అబుదాబిలోని షేక్ జాయిద్ గ్రాండ్ మసీద్ ను సందర్శించిన ఏపీ సీఎం
- ప్రజలంతా బాగుండాలని కోరుకున్నా
విదేశీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం యూఏఈలో అక్కడి అధికారులతో పలు అంశాలపై చర్చిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌తో కలిసి చంద్రబాబు నాయుడు ఈ రోజు అబుదాబిలోని షేక్ జాయిద్ గ్రాండ్ మసీదును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఏపీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలని అల్లాను ప్రార్థించానని అన్నారు. ఈ ప్రదేశాన్ని సందర్శించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాని అన్నారు. ఏపీ ప్రజలతో పాటు ప్రపంచంలోని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ఎటువంటి అడ్డంకులూ లేకుండా ఏపీ రాష్ట్రాభివృద్ధి జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.