revan: ఏదో తూతూ మంత్రంగా 'పోవట్లేదు' అంటే సరిపోదు!: రేవంత్ పై ఎల్.రమణ ఫైర్

  • రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన ఎల్ రమణ
  • మొక్కుబడిగా మాత్రమే చెప్పాడంటూ ఎద్దేవా
  • చంద్రబాబుకు విషయం వెల్లడించాం
  • వచ్చిన తరువాత మాట్లాడతామన్న రమణ

తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడం లేదని, తెలంగాణ సీఎం కేసీఆర్ పై పోరాటమే తన లక్ష్యమని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ స్పందించారు. రేవంత్ మొక్కుబడిగా మాత్రమే పార్టీ మారడం లేదని చెప్పారని అభిప్రాయపడ్డ ఆయన, గట్టిగా తాను పార్టీ మారడం లేదని రేవంత్ చెప్పలేదని విమర్శించారు.

ఏదో తూతూ మంత్రంగా పార్టీ మారట్లేదని చెబితే సరిపోదని, కార్యకర్తల్లో ఎంతో చర్చ జరుగుతోందని, దానికి పుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత రేవంత్ దేనని అన్నారు. రేవంత్ వ్యవహారాన్ని విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబుకు వివరించామని, ఆయన వచ్చిన తరువాత మొత్తం విషయమై చర్చిస్తామని అన్నారు. కాగా, రేవంత్ సైతం చంద్రబాబు వచ్చిన తరువాత కలిసి వివరణ ఇస్తానని చెబుతుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News