ప్రభాస్: అప్పుడు నేను, ప్రభాస్ పోటీపడి డ్యాన్స్ చేశాం: సీనియర్ నటుడు కృష్ణంరాజు

  • 45 నిమిషాల పాటు ఏకధాటిగా డ్యాన్స్ చేశాం
  • ఈ సంఘటన ప్రభాస్ సినిమాల్లోకి రాకముందు జరిగింది
  • ఓ ఇంటర్వ్యూలో ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రేపు తన పుట్టినరోజు జరుపుకోనున్నాడు. ఈ సందర్భంగా ప్రభాస్ పెదనాన్న, సీనియర్ నటుడు కృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘ఓ బర్త్ డే పార్టీలో నేను, ప్రభాస్ పోటీపడి డ్యాన్స్ చేశాం. సుమారు 45 నిమిషాల పాటు ఏకధాటిగా చేశాం. ఈ సంఘటన ప్రభాస్ సినిమాల్లోకి రావడానికి రెండు సంవత్సరాల ముందు జరిగింది.

 ‘సినిమాల్లోకి రావడం ఇష్టమేనా?’ అని ప్రభాస్ ని అప్పుడు నేను అడిగితే ‘ఇష్టమే’ అన్నాడు. దాంతో వైజాగ్ సత్యానంద్ గారి వద్దకు నటనలో శిక్షణకు పంపించాం. ‘మామూలుగా కొడుకును ఐదు సంవత్సరాల వరకు దేవుడిలా చూడాలి. ఐదు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వరకు బానిసలా చూడాలి. పద్దెనిమిది సంవత్సరాల నుంచి స్నేహితుడిలా చూడాలి’ అని మా నాన్నగారు నాకు చెప్పే వారు. మా నాన్నగారు నన్ను అలానే చూశారు, ప్రభాస్ ని నేనూ అలానే చూస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News