రేవంత్ రెడ్డి: నేను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలు అబద్ధం: రేవంత్ రెడ్డి

  • మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి
  • నేను ఏ పార్టీలోనూ చేరట్లేదు
  • మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోంది
  • చంద్రబాబు విదేశాల నుంచి రాగానే అన్ని విషయాలు వివరిస్తా

తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలు అబద్ధమని తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘నేను ఏ పార్టీలోనూ చేరట్లేదు. పార్టీ మారుతున్నానంటూ మీడియా అనవసర రాద్ధాంతం చేస్తోంది. మీడియాలో వార్తలతో కార్యకర్తలు అపోహపడుతున్నారు. చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత అన్ని విషయాలు వివరిస్తా. రాబోయే ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా. టీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తా’ అని చెప్పారు.

  • Loading...

More Telugu News