లావణ్య త్రిపాఠి: సినిమాలు కాకుండా మరో వ్యాపారం కూడా చేయాలని ఉంది: హీరోయిన్ లావణ్య త్రిపాఠి
- ఫిట్ నెస్ పై నాకు మంచి అవగాహన ఉంది
- అలాగే, పలు రకాల ఆహారపదార్థాలన్నా ఇష్టపడతా
- ఈ రెండు రంగాలకు చెందిన వాటితోనే వ్యాపారం మొదలు పెడతా
- పాత్రికేయులతో లావణ్య త్రిపాఠి
సినిమాల్లో నటించడమే కాకుండా మరో వ్యాపారం కూడా చేయాలని తనకు ఉందని ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి చెప్పింది. అయితే, వ్యాపారం ఎప్పుడు ప్రారంభించాలనే విషయంలో ఇంకా స్పష్టత లేదని తెలిపింది. తనకు ఫిట్ నెస్ పై మంచి అవగాహన ఉందని, రకరకాల ఆహార పదార్థాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన లావణ్య త్రిపాఠి, ఈ రెండు రంగాలకు చెందిన వాటితోనే వ్యాపారం మొదలు పెడతానని అన్నారు.
కాగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రంలో హీరో రామ్ సరసన లావణ్య త్రిపాఠి నటించింది. ఈ నెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఆమె పాత్రికేయులతో మాట్లాడింది.