వాంఖడే: వాంఖడే వన్డే: శతకం బాదిన కోహ్లీ
- 111 బంతుల్లో 100 పరుగులు చేసిన కోహ్లీ
- వన్డే కెరీర్ లో 31వ సెంచరీ చేసిన కోహ్లీ
- 45 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్: 233/5
వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ వంద పరుగులు పూర్తి చేశాడు. 108 బంతుల్లో కోహ్లీ 100 పరుగులు చేశాడు. దీంతో, వన్డే కెరీర్ లో కోహ్లీ తన 31వ సెంచరీ నమోదు చేశాడు. ఇప్పటి వరకు 7 ఫోర్లు, 1 సిక్స్ ను కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు.
కాగా, ధోనీ అవుట్ కావడంతో కోహ్లీతో జతకట్టిన పాండ్యా దూకుడుగా ఆడుతున్నాడు. ఇప్పటివరకు పాండ్యా 15 బంతులు ఆడి 16 పరుగులు చేయగా, అందులో ఒక ఫోర్, ఒక సిక్స్ ఉండటం విశేషం. 45 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా స్కోర్: 233/5