సాయి పల్లవి: మలయాళీ భామను కాదంటున్న సాయిపల్లవి!
- ‘మలయాళీ భామ’ అన్న విలేకరిపై సాయిపల్లవి మండిపాటు!
- నేను తమిళమ్మాయిని
- కోయంబత్తూరులో పుట్టానంటున్న సాయిపల్లవి
తాను మలయాళీ భామను కాదని, తమిళ అమ్మాయినని నటి సాయిపల్లవి స్పష్టం చేసింది. ఇటీవల ఓ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆమెను ‘మలయాళీ భామ’ అని ఓ విలేకరి సంబోధించడంతో సాయిపల్లవి మండిపడింది. తాను మలయాళీ అమ్మాయిని కాదని, తమిళ అమ్మాయినని గట్టిగా చెప్పిందట. తమిళనాడులోని కోయంబత్తూరు తన స్వస్థలమని ‘ఫిదా’ సాయిపల్లవి తెలిపింది. కాగా, తెలుగులో ‘ఎంసీఏ’ చిత్రంలో హీరో నాని సరసన, తమిళంలో ‘మారి 2’లో హీరో ధనుష్ కు జోడీగా సాయిపల్లవి నటిస్తోంది.