రాణీ ముఖర్జీ: బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీకి పితృ వియోగం

  • కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామ్ ముఖర్జీ
  • ఈరోజు తెల్లవారు జామున మృతి
  • బాలీవుడ్ ప్రముఖుల సంతాపం

ప్రముఖ బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ తండ్రి, రామ్ ముఖర్జీ మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్టు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సంఘటనపై బాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు.

సీనియర్ ఫిల్మ్ మేకర్ అయిన రామ్ ముఖర్జీ చాలా కాలం అనారోగ్యంతో బాధపడ్డారు. ఈరోజు తెల్లవారుజామున ఆయనకు బీపీ పడిపోవడంతో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించామని, అప్పటికే ఆయన మృతి చెందారని ఆయన భార్య కృష్ణా ముఖర్జీ తెలిపారు. కాగా, హిందీ, బెంగాలీలో పలు సినిమాలను ఆయన నిర్మించారు. ముంబైలో ఫిల్మాలయ అనే స్టూడియోను స్థాపించారు. ‘హమ్ హిందూస్థానీ’, ‘లీడర్’ తదితర సినిమాలను నిర్మించారు. 1997లో రాణీ ముఖర్జీ హిందీలో నటించిన మొదటి చిత్రం ‘రాజా కీ ఆయేగి బరాత్’కు తండ్రి రామ్ ముఖర్జీయే నిర్మాతగా వ్యవహరించారు. 

  • Loading...

More Telugu News