సీపీఐ నారాయణ: ఏపీ టీడీపీ నేతలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలి: సీపీఐ నారాయణ

  • యనమలకు కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులు ఎలా వచ్చాయి? ఏపీలోని కార్పొరేట్ కళాశాలల్లో ఆత్మహత్యల బాధ్యత ప్రభుత్వానిదే
  • మంత్రులు నారాయణ, గంటాలపై చర్యలు చేపట్టాలి
  • సీపీఐ నేత నారాయణ డిమాండ్ 

ఏపీ టీడీపీ నేతలపై తెలంగాణ టీడీపీ నేత రేవంత్ చేసిన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. అనంతపురంలో ఈరోజు పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ, యనమల రామకృష్ణుడుకి రెండు వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు పనులను, పరిటాల సునీత, పయ్యావుల కేశవ్ కుటుంబాలకు బీర్ల ఫ్యాక్టరీ లైసెన్స్ లు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై నారాయణ ఆరోపణలు గుప్పించారు.

పోలవరం ప్రాజెక్ట్ కు చంద్రబాబు వ్యతిరేకమని, ఈ విషయాన్ని నిరూపించేందుకు తాను సిద్ధమని అన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోలవరం, పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుల విస్తరణకు వ్యతిరేకంగా వారు ఉద్యమించిన విషయాన్ని ప్రస్తావించారు. ఏపీలోని కార్పొరేట్ కళాశాలల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్  చేశారు. కాగా, సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ, ఏపీ మంత్రులు నారాయణ, గంటా శ్రీనివాసరావుపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News