కేసీఆర్: అవినీతి సీఎం కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదు: నాగం జనార్దన్ రెడ్డి
- కేసీఆర్ పై నాగం తీవ్ర వ్యాఖ్యలు
- కేసీఆర్ లాంటి అవినీతి ముఖ్యమంత్రిని చూడలేదు
- టీఆర్ఎస్ అబద్ధాల పార్టీ
- కేవలం కేసీఆర్ వల్లే తెలంగాణ రాలేదు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీఆర్ఎస్ పాలన అవినీతిమయమని, కేసీఆర్ జైలుకు వెళ్లక తప్పదని తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పటివరకు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశాను కానీ, కేసీఆర్ లాంటి అవినీతి ముఖ్యమంత్రిని మాత్రం తాను చూడలేదని అన్నారు.
టీఆర్ఎస్ పార్టీ అబద్ధాల పార్టీ అని, ట్రాక్టర్లు, గొర్రెలు, బర్రెలు టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇస్తున్నారని నాగం ఆరోపించారు. బీజేపీ మద్దతిస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది తప్పా, కేవలం కేసీఆర్ ఒక్కరి వల్లే ఈ రాష్ట్రం ఏర్పడలేదని ఆయన అన్నారు.