కిదాంబి శ్రీకాంత్: డెన్మార్క్ ఓపెన్ ఫైనల్ లోకి కిడాంబి శ్రీకాంత్
- విన్సెంట్ వాంగ్ వింగ్‌పై 21-18, 21-17 తేడాతో విజయం
- నిన్న వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడు విక్టర్ ఏక్సెల్సన్ ను చిత్తు చేసిన కిడాంబి
డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సిరీస్‌లో ప్రపంచ 8వ ర్యాంకర్, భారత స్టార్ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్.. నిన్న వరల్డ్ నెంబర్ వన్ ఆటగాడు, డెన్మార్క్ కు చెందిన విక్టర్ ఏక్సెల్సన్ ను చిత్తు చేసి, సెమీస్ లో అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ రోజు జరిగిన సెమీఫైనల్ మ్యాచులోనూ అదే ఊపుతో ఆడాడు. విన్సెంట్ వాంగ్ వింగ్‌పై 21-18, 21-17 తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి ప్రవేశించాడు. ఈ సిరీస్ లో అన్ని మ్యాచుల్లోనూ అదరగొట్టేసిన శ్రీకాంత్ ఫైనల్ లోనూ గెలవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.