యువకుడి దాడి.: నడిరోడ్డు మీద మైనర్ బాలికపై యువకుడి దాడి... సీసీ కెమెరాలో రికార్డు
- ముంబయి నెహ్రూనగర్‌లో దారుణం
- అందరూ చూస్తుండగా దాడికి తెగబడ్డ యువకుడు
- నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
ముంబయి నెహ్రూనగర్‌లో ఓ మైనర్ బాలికపై ఓ యువకుడు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా దాడికి తెగబడ్డాడు. ఆ బాలికపై పిడిగుద్దులు కురిపించాడు. దీంతో ఆమె అక్కడే పడిపోయింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. బాధిత బాలిక ఇంటికి సమీపంలో ఉండే ఇమ్రాన్ షాహిద్ షైక్ అనే యువకుడు ఆమె వెంట పడుతున్నాడు. అలాగే ఈ రోజు ఆమె అటుగా వెళుతుండగా చూసిన ఆ యువకుడు తనతో మాట్లాడాలని కోరాడు. అందుకు ఆమె ఎదురు చెప్పడంతో ఈ దాడికి పాల్పడ్డాడు. అనంతరం ఆమెను స్థానికులు ఘట్కోపార్‌లోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ఈ ఘటనపై సమాచారం అందుకుని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి ఈ కేసులో దర్యాప్తు జరుపుతున్నారు.