వైర‌ల్ అవుతోన్న ఫొటోలు: ఒకే జీవిలో మనిషి, పిల్లి, తోడేలు పోలికలు... సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వింత ఫొటోలు!

  • విప‌రీతంగా వైర‌ల్ అవుతోన్న ఫొటోలు
  • ఇవంతా వదంతులే అంటోన్న మలేషియా పోలీసులు
  • అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో ఆగని ఆసక్తికర చర్చ

సోష‌ల్ మీడియాలో ఈ ఫొటోలు విప‌రీతంగా వైర‌ల్ అవుతున్నాయి. ఇందులో క‌నిపిస్తోన్నది మ‌నిషా? జంతువా? అని నెటిజ‌న్లు తెగ చ‌ర్చించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలే కాకుండా వీడియో కూడా రావ‌డం గ‌మ‌నార్హం. వింత ఆకారం ఉన్న ఈ జంతువు మనిషి, తోడేలు, పిల్లి మూడింటినీ పోలి ఉంది. ఈ ఫొటోను ఓ వ్య‌క్తి మ‌లేషియాలో తీశాడ‌ని పేర్కొంటున్నారు. ఈ వింత ఆకార జంతువు నిజంగానే ఉంద‌ని చాలా మంది అంటున్నారు. ఈ ఫొటో ప్ర‌పంచ వ్యాప్తంగా వైర‌ల్‌గా మారడంతో దీనిపై స్పందించిన మలేషియా పోలీసులు అలాంటి వింత జీవి త‌మ ప్రాంతంలో ఉన్నట్లు తమకు సమాచారం లేదని స్ప‌ష్టం చేశారు. ఇవి పుకార్లేనని కొట్టిపారేశారు.

అయిన‌ప్ప‌టికీ సోష‌ల్ మీడియాలో దీనిపై చ‌ర్చ మాత్రం ఆగ‌డం లేదు. ప్ర‌స్తుతం దాన్ని ఓ లాబరేటరీలో ఉంచార‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు. మ‌నిషిని పోలి ఉన్న దీనికి నాలుగు కాళ్లు ఉన్నాయి. పశ్చిమ మలేషియాలోని పహంగ్ ప్రాంతంలో ఈ జీవి ఉందని అంటున్నారు. తలపై కొద్దిగా జుట్టు, వెన‌క భాగంలో తోక క‌న‌ప‌డుతున్నాయి. ఎవ‌రో ఈ ఫొటోని కావాల‌నే క్రియేట్ చేసి వైర‌ల్ చేసిన‌ట్లు తెలుస్తోంది.


  • Loading...

More Telugu News