ఒకరి మృతి : మంచిర్యాలలో భగ్గుమన్న పాత కక్షలు.. కత్తులతో దాడి.. ఒకరి మృతి
- లక్సెట్టిపేటలో కత్తులతో దుండగుల వీరంగం
- మరో ఇద్దరికి తీవ్రగాయాలు
- మృతుడు మామిడి చంద్రమోళిగా గుర్తింపు
మంచిర్యాల లక్సెట్టిపేటలో పాతకక్షలు భగ్గుమన్నాయి. కత్తులతో పలువురు దుండగులు వీరంగం సృష్టించారు. ఓ వర్గం వ్యక్తులే లక్ష్యంగా దాడికి దిగిన దుండగులు పలువురిపై విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. దుండగుల దాడిలో మామిడి చంద్రమోళి అనే వ్యక్తి మృతి చెందాడని, మామిడి కృష్ణంరాజు, రాజగోపాల్ అనే వ్యక్తులకు గాయాలయ్యాయని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.