టీఎస్‌పీఎస్సీ: శుభవార్త.. 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రకటన చేసిన టీఎస్‌పీఎస్సీ.. పూర్తి వివరాలు
- టీఆర్టీ ప్రకటన విడుదల
- ఈ నెల 30 నుంచి వచ్చేనెల 30 వరకు దరఖాస్తుల స్వీకరణ
- వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష
ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ రోజు టీఆర్టీ ప్రకటన విడుదలైంది. మొత్తం 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే టీఎస్‌పీఎస్సీ 5 నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు పేర్కొంది.
స్కూల్ అసిస్టెంట్లు 1941, పీఈటీ 416, స్కూల్ అసిస్టెంట్లు 9, భాషా పండితులు 1011, ఎస్‌జీటీ 5415 ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపింది. ఈ నెల 30 నుంచి వచ్చేనెల 30 వరకు దరఖాస్తులను స్వీకరిస్తామని చెప్పింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్ష నిర్వహిస్తామని తెలిపింది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ, భాషా పండితులకు టెట్‌లో 20 శాతం వెయిటేజీ ఉంటుందని పేర్కొంది. పూర్తి వివరాల కోసం చూడండి...