మెహ్రీన్ పిర్జాదా: డియర్ ఫ్యాన్స్... నా గురించి ఆ ఫేక్ న్యూస్ న‌మ్మ‌కండి: మెహ్రీన్ పిర్జాదా

  • అనిల్ రావిపూడి, ర‌వితేజ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘రాజా ది గ్రేట్’
  • ‘రాజా ది గ్రేట్’లో నటించిన మెహ్రీన్ పిర్జాదా
  • మరో సినిమాలోనూ నటిస్తోందంటూ వార్తలు
  • నమ్మకూడదని చెప్పిన హీరోయిన్

అనిల్ రావిపూడి, ర‌వితేజ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన ‘రాజా ది గ్రేట్’ సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన మెహ్రీన్‌ పిర్జాదా త‌న అభిమానుల‌కు ఈ రోజు ఓ ట్వీట్ చేసింది. తాను మంచి సినిమాల్లో న‌టించాల‌నుకుంటున్నాన‌ని, అందుకోసం కొంత‌ స‌మ‌యం తీసుకుంటున్నాన‌ని తెలిపింది. తాను ఇప్ప‌టివ‌ర‌కు ఏ కొత్త ప్రాజెక్ట్‌కి ఒప్పుకోలేద‌ని పేర్కొంది. ఈ విష‌యంలో వ‌స్తోన్న ఫేక్ న్యూస్‌ని న‌మ్మ‌కూడ‌ద‌ని తెలిపింది. ఒక వేళ తాను కొత్త ప్రాజెక్టుకి సైన్ చేస్తే ఆ విష‌యాన్ని అభిమానులకు తానే మొద‌ట తెలుపుతాన‌ని పేర్కొంది. తాజాగా ఈ భామ నటించిన ‘రాజా ది గ్రేట్’ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.  

  • Loading...

More Telugu News