రేవంత్ రెడ్డి: రేవంత్ రెడ్డి తీరుపై స్పందించిన ఏపీ మంత్రి చినరాజప్ప
- కేసీఆర్ కు ఏపీ టీడీపీ నేతలు అంత ప్రాధాన్యం ఎందుకిస్తున్నారని ఇటీవలే రేవంత్ రెడ్డి ప్రశ్న
- గుంటూరులో మీడియాతో మాట్లాడిన చినరాజప్ప
- ఏపీ నాయకులపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమన్న హోంమంత్రి
టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తండ్రి సత్యనారాయణ ఇటీవల కన్నుమూశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఈ రోజు జీవీ ఆంజనేయులు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు. అనంతరం చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారంపై స్పందించారు. కేసీఆర్‌కు అంతగా ప్రాధాన్యం ఎందుకు ఇస్తున్నారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు. ఏపీ నాయకులపై రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని చినరాజప్ప వ్యాఖ్యానించారు. కాగా, మహిళలను వేధించిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని చినరాజప్ప అన్నారు. అలాగే బెట్టింగ్‌లో కుమ్మక్కైన పోలీసు అధికారులను సస్పెండ్ చేశామని తెలిపారు.