వర్ల రామయ్య: వచ్చే ఎన్నికల వరకు తీర్పు రాకుండా ఉండేందుకే జగన్ ప్రయత్నాలు: వర్ల రామయ్య
- సాక్ష్యాలు బలంగా ఉన్నాయి
- జగన్ జైలుకు వెళ్లడం ఖాయం
- జాప్యం చేసేందుకే జగన్ పాదయాత్ర
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్రమాస్తుల కేసులో సాక్ష్యాలు బలంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పోరేషన్ ఛైర్మన్, టీడీపీ నేత వర్ల రామయ్య అన్నారు. ఈ రోజు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని వ్యాఖ్యానించారు.
ఈ కేసులో విచారణను మరింత జాప్యం చేసేందుకే పాదయాత్ర పేరుతో జగన్ కొత్త నాటకానికి తెరతీశారని ఆయన విమర్శించారు. జగన్ కేసును పిల్‌గా స్వీకరించి కోర్టు రోజువారీ విచారణ జరపాలని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల వరకు తీర్పు రాకుండా ఉండేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. అక్రమాస్తుల కేసులో విచారణను త్వరగా పూర్తి చేయాలని అన్నారు.